ఢిల్లీలో అల్లర్లపై హైకోర్టుఆగ్రహాం

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో. అల్లర్లపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ పరిణామాలపై నేడు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టనుంది. జరిగిన ఘటనలపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీ, మరణించినవారి కుటుంబాలతోపాటు గాయపడినవారికి పరిహారం, ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన నేతల ప్రసంగాలపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. కోర్టు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని అల్లర్ల పరిస్థితి చేయిదాటిపోతుందని కేంద్రానికి సిఎం కేజ్రీవాల్‌ విన్నవించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేక పోతున్నారని, ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఢిల్లీలో పారామిలిటరీ బలగాలు మోహరించాయి. 45 కంపెనీల బలగాలు మోహరించాయి. 4 ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటికి ఢిల్లీ అల్లర్లలో 20 కి మృతుల సంఖ్య పెరిగింది. 200 మందికి పైగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం సమీక్షిస్తోంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/