టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై సందిగ్ధత
కోవిడ్-19 ఎఫెక్ట్.. మూడు నెలల తర్వాతే తుది నిర్ణయం

టోక్యో: చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్19) వైరస్ ప్రభావం త్వరలో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరగనున్న 2020 ఒలింపిక్స్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లే కనబడుతోంది. ఇప్పటికే కరోనాతో ఒలింపిక్స్ నిర్వహణపై పలు సందేహాలు నెలకొన్నాయి. అయితే.. టోక్యో నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరో మూడు నెలలు వేచి చూస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సీనియర్ సభ్యుడు డిక్ పౌండ్ ఓ ప్రకటనలో తెలిపారు. డిక్ పౌండ్ మాట్లాడుతూ… ‘ఒలింపిక్స్‌కు ఏర్పాట్లు చేసేందుకు క్రీడల ఆరంభం తేదీకి ముందు రెండు నెలల సమయం చాలు. ఒలింపిక్స్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. కొవిడ్ వైరస్‌పై ఈ మూడు నెలల్లోగా మరింత స్పష్టత వస్తుంది. అప్పుడే టోక్యో నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ సమయంలో కొవిడ్ అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం. ఆటగాళ్లు తమ క్రీడలపై దృష్టి పెట్టండి. టోక్యో ఒలింపిక్స్ తప్పకుండా జరుగుతాయని భావిస్తున్నా’ అని తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/