అటువంటి వారు స‌మాజానికి అవసరం

సోనూసూద్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం..చంద్ర‌బాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్ర‌బాబు కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌లు రంగాల నిపుణుల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశంలో మాట్లాడారు. ఇందులో సినీన‌టుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఎన్టీఆర్ ట్ర‌స్టు సేవ‌లు అందిస్తోంద‌ని చెప్పారు. క‌రోనా వేళ సోనూసూద్ అనేక సేవలు చేశారని చంద్ర‌బాబు నాయుడు కొనియాడారు. అటువంటి వారు స‌మాజానికి అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ఎన్నో విప‌త్తులు చూశాను క‌రోనా వంటి సంక్షోభం చూడ‌డం ఇదే ప్ర‌థ‌మమ‌ని చెప్పారు. స‌మాజం ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు సేవ చేయ‌డం బాధ్య‌త‌గా ప్ర‌తి ఒక్క‌రూ భావించాల‌ని ఆయ‌న‌ తెలిపారు.

క‌రోనాపై పోరాటంలో కుటుంబ స‌భ్యులు కూడా రోగుల వ‌ద్ద‌కు వెళ్ల‌ట్లేదని, ఇటువంటి స‌మ‌యంలో ఫ్రంట్‌లైన్ వారియ‌ర్లు విలువైన సేవ‌లు అందిస్తున్నారని ఆయ‌న చెప్పారు. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. అధికారంలో ఉన్న లేకున్నా ప్ర‌జా సేవ‌లో ఉండ‌డంమే టీడీపీ ల‌క్ష్యమ‌ని చెప్పుకొచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/