కరోనా థర్డ్ వేవ్ పట్ల నిర్లక్ష్యం తగదు
cm-arvind-kejriwal
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19 థర్డ్ వేవ్ పట్ల బ్రిటన్ లో సంకేతాలు వెల్లడవుతున్నాయని, అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. థర్డ్ వేవ్ పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండటం తగదని అన్నారు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
నగరం నలుమూలలా 9 దవాఖానల్లో 22 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని వెల్లడించారు. కొవిడ్-19 థర్డ్ వేవ్ మనను తాకరాదని తాము కోరుకుంటున్నామని, అయితే అదే జరిగితే ఢిల్లీ దాన్ని సమిష్టిగా ఎదుర్కొంటుందని చెప్పారు. కొవిడ్ సెకండ్ వేవ్ ను ఢిల్లీ ప్రజలు సమైక్యంగా నిరోధించారని, పరిశ్రమ వర్గాలు కూడా మహమ్మారి కట్టడికి కలిసివచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/