తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి సినారె

సినారెకు నివాళులర్పించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: సిఎం కెసిఆర్ డాక్టర్‌ సినారె వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ సాహితీ సౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన గొప్ప వ్యక్తి సినారె అని అన్నారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన శైలిలో తెలంగాణ పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని సీఎం అన్నారు. దక్కనీ ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్‌తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్‌కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని సీఎం గుర్తుచేసుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/