మేయర్ పీఠం కచ్చితంగా బీజేపీదే
‘గ్రేటర్’ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా

Hyderabad: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో రోష్ షోలో పాల్గొన్న అమిత్ షా, రోడ్ షో అనంతరం విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్ లో తనకు లభించిన స్వాగతానికి ఆయన హైదరాబాదీయులకు కృతజ్ణతలు తెలిపారు. రోడ్ షోలో ప్రజాదరణను చూస్తుంటే ఈ సారి మేయర్ పీఠం కచ్చితంగా బీజేపీదే అని విశ్వాసం కలుగుతోందన్నారు.
జాతీయ నాయకులు హైదరాబాద్ కు వరదలా వస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యఖ్యలు, విమర్శలను ప్రస్తావిస్తూ, మరి హైదరాబాద్ కు వరదల వచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
భాగ్యనగరంలో వరదల వల్ల దాదాపు 70 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని వివరించారు. 100 రోజుల్లో అభివృద్ధి అనే నినాదం ఇచ్చి ఐదేళ్లు అయిందని టీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు.
హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తామన్నారు… అదేమైందని నిలదీశారు. గాంధీ, ఉస్మానియా తరహాలో నాలుగు ఆసుపత్రులన్నారు, అవేమయ్యాయని ఎద్దేవా చేశారు.
తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెబుతారనే ఆశిస్తున్నానని అమిత్ షా అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/