బిఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ 51 మందికి బీ-ఫారాలు అందజేశారు. మిగతావారికి రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇక బీ-ఫారాలు నింపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.. పొర‌పాటు చేయొద్ద‌ని కేసీఆర్ సూచించారు. శ్రీనివాస్ గౌడ్, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, కృష్ణ‌ మోహ‌న్ రెడ్డి మీద కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. గెల‌వ‌లేక కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. సాంకేతికంగా కార‌ణాలు చూపి, ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మ‌న‌కు మంచి న్యాయకోవిదులు ఉన్నారు. మీకు గైడ్ చేయ‌డానికి న్యాయ‌వాదులు అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి, తెలియ‌ని విష‌యాలు తెలుసుకోవాలన్నారు.

కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ర‌పున ఎమ్మెల్సీ క‌విత బీ-ఫార‌మ్ అందుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఖ‌మ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. బీ-ఫార‌మ్ అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ష‌కీల్, జాజాల సురేంద‌ర్, గ‌ణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, గంప గోవ‌ర్ధ‌న్, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, రాజేంద‌ర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, జైపాల్ యాద‌వ్, అంజ‌య్య యాద‌వ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, చంటి క్రాంతి కిర‌ణ్, మ‌హిపాల్ రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, రేగా కాంతారావు, హ‌రిప్రియ నాయ‌క్, పువ్వాడ అజ‌య్, లింగాల క‌మ‌ల్ రాజ్, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు, మెచ్చా నాగేశ్వ‌ర్ రావుతో పాటు ప‌లువురు ఉన్నారు.