ప్ర‌జా ప్ర‌తినిధులు ఎక్కడ..?..చంద్ర‌బాబు

వ‌ర‌ద సాయంలో విఫ‌ల‌మ‌యిన ప్ర‌భుత్వం..చంద్ర‌బాబు


చిత్తూరు: టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. చిత్తూరు జిల్లా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. వ‌ర‌ద‌సాయంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌యింద‌ని అన్నారు. వరద ప్రాంతాల్లో వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడ..?. వరద బాధితులు చచ్చిపోయిన తర్వాత వచ్చి పరామర్శిస్తారా..?. పోలీసులు వైస్సార్సీపీకి తొత్తుగా మారారు. నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేసి నిరూపించలేకపోయారు. ప్రశ్నిస్తే నాతో పాటు టీడీపీ నేతల్ని వేధిస్తున్నారు.. కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో మానసికంగా వేధించారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నా గురించి మాట్లాడుతారా?. నా ఇంటిపై… పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. వైస్సార్సీపీ నేతలు గంజాయిని డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఎవరూ అధైర్యపడవద్దు.. టీడీపీ అండగా ఉంటుంది. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం జగన్‌రెడ్డి గాలిలో తిరుగుతారా?. వరదసాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. నాపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/