అలీ కూతురు వివాహ వేడుకల్లో సందడి చేసిన చిరంజీవి

chiranjeevi at ali daughter wedding

నటుడు అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షేక్ షెహ్యాజ్ అనే వ్యక్తి తో హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నటి రోజా సైతం పెళ్లి వేడుకలలో తలుక్కుమని మెరిసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా తన కూతురి పెళ్లికి రావాలంటూ.. ఆలీ భార్య జుబేదాను వెంటపెట్టుకొని ఇండస్ట్రీ మిత్రుల ఇంటికి వెళ్లి స్వయంగా శుభలేఖలు అందించాడు. నగల షాపింగ్ నుంచి హల్దీ ఫంక్షన్ వరకు అన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు పెళ్లి పనులను అప్డేట్ ఇస్తూ వచ్చింది జుబేదా. ఇక అలీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. అలీ సినిమాల విషయానికి వస్తే 1979ల వెండితెరకు పరిచయమైన అలీ ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.