హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా.. రాకేశ్ టికాయత్ హాజరు

హైదరాబాద్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ రేపు హైద‌రాబాద్ కు రానున్నారు. ఆల్ ఇండియన్‌‌ కిసాన్‌‌ సంఘర్ష్‌‌ కోఆర్డినేషన్‌‌ కమిటీ (ఏఐకెఎస్‌‌సీసీ) ఆధ్వర్యంలో గురువారం(నవంబర్ 25) హైదరాబాద్‌‌ లోని ఇందిరాపార్క్‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దు చేపట్టిన రైతుల పోరాటం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు.

ఈ ధర్నాకు కిసాన్‌‌ మోర్చా జాతీయ నాయకుడు రాకేశ్‌‌ టికాయత్‌‌ రానున్నారు. సాగు చట్టాల ర‌ద్దు ను పార్లమెంటు ఉబ‌య స‌భ‌ల‌లో ఆమోదించాల‌ని, అలాగే రైతులు పండించే అన్ని పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌త్తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ మ‌హా ధ‌ర్నా జ‌ర‌గ‌నుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/