వీరసింహరెడ్డి ట్రైలర్ విడుదల

వీరసింహరెడ్డి నుండి అసలు సిసలైన ట్రైలర్ వచ్చేసింది. బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించి శత్రువులను ఊచకోత కోశాడు. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా శుక్రవారం సినిమా తాలూకా ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై మరింత హైప్ పెంచారు.

ట్రైలర్ లో డైలాగ్స్ బాగా పేలాయి. సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదనే నేనొక్కన్ని కత్తి పట్టాఅంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్..వీర సింహారెడ్డి.. అంటూ బాలయ్య మీసం తిప్పుతున్న తీరు ఆయన నట విశ్వరూపం థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా వుంది. పుట్టింది పులిచర్ల..చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్.. అంటూ బాలయ్య ఓ రేంజ్ లో డైలాగ్ చెప్పాడు.

`మా బావ మనోభావాలు పాటలో చంద్రిక రవి పై బాలయ్య సిగరెట్ విపసిరేసి రజనీలా అంతు కోవడం.. అపాయింట్ మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడనూ లొకేషన్ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడకా… పగోడు పంపుతున్న పసుపు కుంకుమలతో బతుకుతుంటే ముత్తైదువులా లేనూ..ముండమోపిలా వున్నా.. అంటూ వరలక్ష్మీ చెప్పిక డైలాగ్, బై బర్త్ నా డీఎన్ ఏకే పొగరెక్కువ అంటూ బాలయ్యచెప్పడం ఇవన్నీ కూడా ట్రైలర్ లో హైలైట్స్ గా నిలిచాయి. ట్రైలర్ లోనే డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ లా ఉంటె..రేపు థియేటర్స్ లలో అభిమానుల్లో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక మరోసారి థమన్ బ్యాక్ గ్రౌండ్ దద్దరిల్లించాడు. మరోసారి థియేటర్స్ లలో DTS బాక్స్ లు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. గోపీచంద్ డైరెక్షన్ అదిరిపోయిందనే విధంగా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ ఖర్చు కు వెనకాడకుండా నిర్మించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తుంది.

YouTube video