ఏప్రిల్ 25 నుండి తెలంగాణలో విద్యాసంస్థలకు వేసవి సెలవులు

విద్యాసంస్థలకు సంబంధించి వేసవి సెలవులు తేదీని ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం వేస‌వి సెలవులు ప్ర‌క‌టించింది. 2023-24 విద్యాసంవ‌త్స‌రానికి గానూ జూన్ 12న పాఠ‌శాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.

ఆరో తరగతి నుంచి ఎనమిదో తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న విద్యార్థుల పరీక్ష పత్రాలను ఏప్రిల్ 21 నుంచి 24 వరకు మూల్యాకణం చేసి మార్క్స్ ని ప్రకటిస్తారు. 25వ తేదీన పేరెంట్ టీచ‌ర్ మీటింగ్ నిర్వ‌హించి, విద్యార్థుల మార్కుల‌ను త‌ల్లిదండ్రుల‌కు తెలిపి, వేస‌వి సెలవులు ప్ర‌క‌టించ‌నున్నారు.