వైసీపీ మేనిఫెస్టో ఫై బాబు కామెంట్స్

వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఫై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. వైసీపీ మేనిఫెస్టో కంటే కూటమి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్‌గా ఉందని పేర్కొన్నారు. మన సూపర్ సిక్స్ ముందు జగన్‌ మేనిఫెస్ట్‌ వెలవెలబోయిందన్నారు. అందులో ఏముందని ప్రశ్నించారు. యువత, రైతులు, మహిళలకు ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. దోచుకున్నంత దోచుకున్నా.. దాచుకున్నంత దాచుకున్నా… ఇప్పుడు చేతులెత్తేస్తున్నా అంటూ చేతులెత్తేసిన వ్యక్తి జగన్ అంటూ ఎద్దేవా చేశారు.

సీపీఎస్‌ (CPS) రద్దు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రస్తవించలేదని మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని పేర్కొన్న జగన్‌ హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేశారని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి గోదావరిలో కలిపారని వెల్లడించారు. అంశం గతంలో తమ పరిపాలన స్వర్ణయుగం కాగా వైసీపీ పాలన రాతియుగమని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్పీ పైనే ఉంటుందని పేర్కొన్నారు.