పిఠాపురంలో వరుణ్ కు ప్రజలు బ్రహ్మ రథం

మెగా హీరో వరుణ్ తేజ్.. బాబాయ్ కోసం ఎన్నికల ప్రచారం చేసారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్..ఈసారి మాత్రం పిఠాపురంలో నిల్చుని విజయం ఫై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేసిన పవన్..ఓటర్లను గెలిపించాలని..తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే నెం 1 గా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని..అనేక హామీలు ఇచ్చారు.

ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ సైతం పవన్ కోసం ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరుణ్ మాట్లాడుతూ.. బాబాయికి అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులందరూ ప్రచారం చేస్తామని తెలిపారు. చిత్రపరిశ్రమలో (Film Industry)తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాబాయి పవన్‌కల్యాణ్‌ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకున్నారని అన్నారు. బాబాయిపై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణపై స్పందిస్తూ నిజాయితీ ముందు అవేవి నిలబడవని అన్నారు. ఒకవైపు సినిమా షూటింగ్‌లు చేస్తూనే బాబాయికి తరుఫున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు.