కూటమి అధికారంలోకి రాగానే డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం – లోకేష్

కూటమి విజయం సాధించిన వెంటనే డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేస్తామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శనివారం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వ్హయించిన లోకేష్ మాట్లాడుతూ.. వాలంటీర్ల ద్వారా పింఛన్‌ను ఇళ్ల వద్దకే తెచ్చిస్తానని చెప్పారు.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్ రూ. 4 వేలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఐదేళ్లలో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని, రాజీనామా లేఖ అని ఎద్దేవా చేశారు. రూ. 500 పింఛన్ పెంచుతామనడం జగన్ దివాలాకోరుతనమని పేర్కొన్నారు.