దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డైకిన్ షోరూమ్ శ్రీ కంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్‌ ప్రారంభం

South India’s largest full-line Daikin showroom inaugurated in Hyderabad

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డైకిన్ షోరూమ్ శ్రీ కంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్, సర్వీసెస్‌ను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్జీత్ జావా సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ‌ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో రెండు దశాబ్దాల నాటి అతిపెద్ద అధీకృత డైకిన్ డీలర్, ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ శ్రీ కంఫర్ట్స్ అన్నారు.‌ ఈ సందర్భంగా శ్రీ కంఫర్ట్స్ సీఈవో బీ కళ్యాణరామన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో డైకిన్ ఉత్పత్తులు, సేవలు ఒకే పైకప్పు కింద అందుబాటులో కలవన్నారు. జపాన్‌కు చెందిన డైకిన్ నివాస, వాణిజ్య, పారిశ్రామిక విభాగాలకు అధునాతన, అధిక నాణ్యత గల ఎయిర్ కండిషనింగ్ పరిష్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడ స్ప్లిట్ ఏసీలు, డక్టబుల్ ఏసీలు, వాణిజ్య స్థలాల కోసం వీఆర్వీలు, క్యాసెట్ ఏసీలు, డీప్ ఫ్రీజర్‌లు, చిల్లర్స్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు, రిఫ్రిజిరేషన్, కోల్డ్ స్టోరేజ్ పరికరాలు, డైకిన్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎయిర్ కండిషనింగ్ సొల్యూషన్‌లను ప్రదర్శిస్తుందన్నారు. షోరూమ్ రిటైల్ కస్టమర్లకు అవసరమైన హై ఎండ్ కూలింగ్ సిస్టమ్‌లను అందించనున్నామని చెప్పారు. ‌

‌‌‌‌‌‌ ఎయిర్ కండిషనింగ్, హెచ్వీఏసీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించడంలో మా రెండు దశాబ్దాల విస్తృతమైన నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అత్యంత సంక్లిష్టమైన, ప్రత్యేకమైన, సముచిత అవసరాలకు పరిష్కారాలను అందించడానికి సహాయం చేస్తుందన్నారు. మా సేవలను కోరుతూ సుదూర ప్రాంతాల నుంచి క్లయింట్లు వస్తున్నారని తెలిపారు. శ్రీ కంఫర్ట్స్ 2001లో ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి దక్షిణ భారతదేశంలో 80కే హెచ్పీ వీఆర్వీ, 15కే టన్నుల డక్ట్ ఏసీలు, 30కే కంటే ఎక్కువ స్ప్లిట్ ఏసీలను విక్రయిస్తున్నామని తెలిపారు. పెద్ద తయారీ కర్మాగారాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల నుంచి హై ఎండ్ రెసిడెన్షియల్ విల్లాల వరకు ఖాతాదారులు ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హెడ్ ఆఫీస కలదన్నారు. చెన్నై, బెంగళూరు, పూణే, తిరుపతి, ఖమ్మం, వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో కార్యాలయాలు కలవన్నారు. శ్రీ కంఫర్ట్స్ నుంచి 210 మందికి పైగా ఇంజనీర్ల నెట్‌వర్క్ అన్ని నగరాలలో క్లయింట్‌ల అవసరాలు తీరుస్తున్నారని తెలిపారు. అన్ని ప్రధాన నగరాల్లో విస్తరిస్తున్నామన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్, కరీంనగర్, కర్నూలు, అనంతపురం, మదురై, మంగళూరులో విస్తరించనున్నామని తెలిపారు. తెలంగాణ సెక్రటేరియట్, రాజ్ భవన్, టెక్ మహీంద్రా, గూగుల్, వెల్స్ ఫార్గో, ఏడీపీ, హైదరాబాద్ మెట్రో రైల్, ఏపీ అసెంబ్లీ, ఏపీ సెక్రటేరియట్ మరెన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లతో సహా అగ్రశ్రేణి ఖాతాదారులకు సేవలు అందించడంలో శ్రీ కంఫర్ట్స్ అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉందన్నారు.