వైస్సార్సీపీ నేతల వ్యాఖ్యలకు టిఆర్ఎస్ నేతల నుండి కౌంటర్లు మొదలయ్యాయి

ప్రస్తుతం వైస్సార్సీపీ vs టీఆరఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రీసెంట్ గా మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని.. కానీ తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని అన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ లాగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా ఆరువేల కోట్లు అప్పులు తీసుకుని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే వారమని హరీష్ రావు అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వరుసపెట్టి కౌంటర్ లు , విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో వైస్సార్సీపీ నేతల కౌంటర్లకు టిఆర్ఎస్ నేతలు రియాక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైస్సార్సీపీ కామెంట్స్ కు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని.. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజమన్నారు. అందులో ఎలాంటి అవాస్తవాలు లేవన్నారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కింది జగన్‌ గ్యాంగేనని ఎద్దేశా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదని.. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని అన్నారు. ఇది వాస్తవమన్నారు. ఏపీ సర్కార్ తెలంగాణ పథకాల పైన ప్రాజెక్టుల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసిందన్నారు. విడిపోయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో మేము బాగా అభివృద్ధి చెందుతున్నామని విమర్శలు చేశారు. మాపైన ఈర్ష్య ఉండవచ్చని మేం పట్టించుకోవడం లేదని… ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదని ఆగ్రహించారు. ప్రచారం కొసం ఏపీ నాయకులు తెలంగాణపై గాని, టిఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావు పై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నానన్నారు.