పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరో అవకాశం

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సిబిడిటి) ప్రకటించింది. ఇప్పటి వరకు డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న గడువును జనవరి 31 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందేందుకు గడువు పొడిగించినట్లు సిబిడిటి ఉత్తర్వులు ఇచ్చింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) సహా మిగిలిన క్షేత్ర నిర్మాణాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుంది. న్యాయబద్దమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు ప్రాసిక్యూషన్ కేసుల పెండింగును తగ్గించేందుకు వన్ టైమ్ అవకాశాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ నాటికి గడువు ఇచ్చింది. పన్ను నేరాలు లేదా ఎగవేతకు పాల్పడిన వారు ట్యాక్స్ బకాయిలు, సర్ఛార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/