దీపావళి నాటికి నగరాల్లో జియో 5జీ సేవలు:ముఖేష్ అంబానీ

వచ్చే ఏడాది డిసెంబరు కల్లా దేశవ్యాప్త 5జీ సేవలు

diwali-2022-will-launch-jio-5g-across-multiple-key-cities-in-india-say-mukesh-ambani

ముంబయిః ముకేశ్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 45వ (AGM) జరుగుతుంది. ఈ సందర్భంగా ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పర్వదినం నుంచే.. సరికొత్త నెట్‌వర్క్ వెలుగులు జిగేల్ మననున్నాయి. దీపావళి నుంచి దేశంలో రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5G అందుబాటులోకి వస్తుందని ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఎటువంటి వైర్లు లేకుండా అందించే ఈ సేవలను జియో ఎయిర్‌ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు జియో చైర్మన్‌ ఆకాశ్ అంబానీ తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చేందుకు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారిగా వర్చువల్‌ రియాల్టీ విధానంలో ఈ AGM నిర్వహించారు. 5G సేవలందించేందుకు మెటా, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కుదుర్చుకుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/