ఆ స్థానాల్లో ఒత్తిడిని జయించేవారు కావాలి
యువ క్రికెటర్లకు కోహ్లీ సందేశం

గువాహటి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు ఓ సందేశం ఇచ్చాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచులను ముగించేందుకు మిడిలార్డర్ సిద్ధంగా ఉండాలన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేసి మ్యాచులు గెలిపించే ఆటగాళ్లు ఇప్పుడు మనకు కావాలి. బ్యాటింగ్ లైనప్‌లో ఎప్పుడూ కూడా టాప్ ఆర్డర్‌పైనే ఆధారపడటం మంచిది కాదు. అలా ఉంటే ఐసిసి టోర్నీలు గెలవలేం. కచ్చితంగా మార్పు తీసుకురావాలి’ అని కోహ్లీ అన్నాడు. ‘యువ ఆటగాళ్లు ముందుకొచ్చి మంచి క్రికెట్ ఆడాలని కోరుతున్నా. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచులను ముగించేందుకు మిడిలార్డర్ సిద్ధంగా ఉండాలి. 6, 7 స్థానాల్లో ఒత్తిడిని జయించేవారి కోసం ఎదురు చూస్తున్నా. ఇక నుంచి జరిగే సిరీస్‌లలో ఒత్తిడిలో ఎవరు నిలుస్తారో చూడాలి. రోహిత్ శర్మ, నాపై ఎక్కువగా ఆధారపడొద్దు. రోహిత్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, నేను త్వరగా ఔటైతే మిడిలార్డర్ ఎలా స్పందిస్తుందో చూడాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/