కరోనా నుండి త్వరగా కోలుకున్నాను

buddha venkanna
buddha venkanna

అమరావతి: టిడిపి నేత బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన ఆరోగ్యంపై ట్వీట్ చేస్తూ ‘నా ప్రత్యక్ష దైవం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి త్వరగా కోలుకున్నాను. పదవులు శాశ్వతం కాదు. నాయకుడిని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతం. కష్ట కాలంలో చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/