జాదవ్ కోసం భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి

kulbhushan jadhav
kulbhushan jadhav

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ చెరలో మరణశిక్ష అనుభవిస్తున్న భారత్‌ నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరపున న్యాయవాదిని నియమించేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాల మేరకు జాదవ్‌కు పాక్‌ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించడానికి ఆయన తరఫున న్యాయవాదిని నియమించే విషయమై పాక్‌ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఐహెచ్సీ విచారణ జరుపుతున్నది. ఈ కేసు విచారణను ఐహెచ్సీ వచ్చేనెల 3కు వాయిదా వేసింది. విశ్రాంత ఇండియన్ నేవీ ఆఫీసర్ జాదవ్‌ (50)కు పాకిస్తాన్ సైనిక కోర్టు 2017 ఏప్రిల్‌లో గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/