నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..

brs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలంటూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేపు జిల్లా కలెక్టర్లకు, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేయనున్నారు.

అమీర్‌పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన MLA లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, KP వివేకానంద్‌తోపాటు కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.