బిజెపి రెండో లిస్ట్ రిలీజ్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి బుధువారం రెండో లిస్ట్ ను ప్రకటించారు. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించగా..రెండో లిస్ట్ లో 72 మందిని ప్రకటించారు. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.

మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేశ్ పేర్లను ప్రకటించింది. మొదటి జాబితాలో 9 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 15 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మరో రెండు చోట్ల మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, పీయూష్ గోయ‌ల్‌, హ‌రియాణా మాజీ సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ల‌కు చోటు ద‌క్కింది.