కాంగ్రెస్ విశాఖ సభ 16కు వాయిదా

Security increased for APCC president YS Sharmila

ఏపీసీసీ విశాఖలో 15న నిర్వహించతలపెట్టి బహిరంగ సభ మళ్లీ వాయిదా పడింది. ఈ బహిరంగ సభను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసినట్లుగా ఏపీసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుండి మళ్లీ ప్రజల్లో కాంగ్రెస్ ఫై నమ్మకం మొదలైంది. ఇదే క్రమంలో షర్మిల..వరుసపెట్టి సభలు , సమావేశాలు , పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడింది. తెలంగాణ లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్..ఏపీలో కూడా అదే తరహాలో హామీలు ప్రకటిస్తుంది.

ఇదే క్రమంలో విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తదితరులు పాల్గొననున్నారు. ఈ సభలో కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నట్టు వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం, రైల్వే జోన్‌ సంబంధించిన మరో తీర్మానం చేయనున్నట్టు సమాచారం. సభా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే రీతిలో ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయని తెలుస్తుంది.