ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా

ఐసొలేషన్ లోకి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం

అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి కలతూర్‌ నారాయణస్వామి కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు ఇవాళ వైద్యాధికారులు కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోంఐసొలేషన్‌కు వెళ్లారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నారాయణస్వామి పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/