భారత్ రైళ్ల తయారై ఆర్డర్‌ను సొంతం చేసుకున్న భెల్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్ల ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వందే భారత్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. ప్రయాణికుల నుండి మంచి ఆదరణ వస్తుండడం తో మరిన్నింటిని అందుబాటులోకి తీసుకరావాలని కేంద్రం భావిస్తుంది. ఈ క్రమంలో మరిన్ని రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఛైర్ కార్లతో నడుసున్న వందే భారత్ రైళ్లను భవిష్యత్‌లో దూర ప్రాంతాలకు కూడా నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందుకోసం స్లీపర్ కోచ్‌లను తయారు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ సంస్థ భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) వందేభారత్ రైళ్ల సరఫరా ఆర్డర్‌ను దక్కించుకుంది. ఒక్కో రైలుకు రూ. 120 కోట్ల చొప్పున మొత్తం రూ.9600 కోట్ల ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ కన్షార్షియంలో భాగస్వామిగా ఉన్న టిటాగఢ్ వ్యాగన్స్‌తో కలిసి భెల్ ఈ రైళ్లను తయారు చేయనుంది. 35 ఏళ్ల కాలానికి వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (ఏఎంసీ) కూడా ఇందులో ఉన్నట్టు భెల్ తెలిపింది. కండిషన్స్ అగ్రిమెంట్ ప్రకారం 80 స్లీపర్ క్లాస్ వందేభారత్ రైళ్లను 72 నెలల్లో అంటే ఆరేళ్లలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 35 ఏళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది.