పవన్ మూవీ లో ధమాకా బ్యూటీ ఐటెం సాంగ్..?

ధమాకా మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీ లీల ..ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ లో ఓ ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు , మరోపక్క రాజకీయాల తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ ఫై హరిహర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్లో ఓ మూవీ , హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. ఇదిలా ఉండగానే మరో చిత్రాన్ని గత బుధువారం ప్రారంభించారు.

సముద్రఖని డైరెక్షన్లో వినోద‌యా సితం చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండగా , త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గత బుధువారం చాలా సింపుల్ గా సినిమాను ప్రారభించారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. మాతృక సినిమాలో అసలు ఒక్క సాంగ్ కూడా లేదు. కానీ పవర్ స్టార్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కొన్ని అంశాలు కోరుకుంటారు. కాబట్టే ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా చూస్తున్నారట.

ఈ సాంగ్ లో ధమాకా బ్యూటీ శ్రీలీలని తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు శ్రీలీల పేరునే చెబుతారు. ధమాకా సినిమాలో ఆమె డ్యాన్స్ మూమెంట్స్ యూత్ ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేశాయి. పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ ల మధ్యలో శ్రీలీల డ్యాన్స్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.