అనారోగ్యాలను నివారించే దానిమ్మ

పండ్లు – ఆరోగ్యం

దానిమ్మ రసానికి ప్రధానమైన తొమ్మిది రకాల అనారోగ్యాలను నివారించే గుణం వుంది.. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగినట్లయితే …

benefits of pomegranate
Benefits of pomegranate


ఇందులో యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరిస్తాయి.. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.. రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి.. గుండె సంబంధిత రోగుల మీద చేసి పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంట్ కు మూడు నెలల పాటు రోజుకు 25 0 మీ . లీ. దానిమ్మ రసం ఇచ్చినపుడు వారిలో రక్తనాళాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్టు ఇటలీలోని హెల్త్ యూనివర్సిటీ నిర్ధారించింది..

కీళ్ల మధ్య వుండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది.. దీంతో ఆస్ట్రియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి.. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది..
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.. ఇందులో వుండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి.

మరిన్ని ఆరోగ్య విషయాలకు (‘స్వస్థ’ ) క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health/