స్వీట్ కార్న్ కేక్

రుచి : వెరైటీ వంటకాలు

Sweet corn cake Making
Sweet corn cake Making

కావాల్సినవి:

స్వీట్ కార్న్ గింజలు-రెండున్నర కప్పులు, చిక్కటి పాలు-కప్పు కొబ్బరిపాలు-కప్పు, మొక్క జొన్న రవ్వ- రెండు కప్పులు , పంచదార- కప్పున్నర , నూనె -ముప్పావు కప్పు, గుడ్లు-నాలుగు, కొబ్బరి కోరు-కప్పు, ఉప్పు- తగినంత, బేకింగ్ సోడా – అర చెంచా

తయారు చేసే విధానం:

ముందుగా అవెన్ ని 350 డిగ్రీల ఫారిన్ హీట్ దగ్గర వేడిచేసి ఉంచుకోవాలి… బేక్ చేయాలనుకుంటున్న పాన్ కి బట్టర్ రాసి సిద్ధం చేసుకోవాలి.. మిక్సీ జార్ లో మొక్క జొన్న గింజలు, పాలు వేసి మెత్తగా పేస్ట్ లా అయ్యేదాకా మిక్సీ పట్టాలి.. ఇందులోనే కొబ్బరి పాలు, మొక్క జొన్న రవ్వ, పంచదార, నూనె, గుడ్లు, ఉప్పు వేసి అన్నే దానితో ఒకటి కలిసేటట్టుగా బాగా కలుపు కోవాలి.. చివరిగా బేకింగ్ సోడా వేసి 50 నిముషాల పాటు బేక్ చేసుకోవాలి.. చివరిగా టూత్ పిక్ తో గుచ్చి చూస్తే పిండి టూత్ పిక్ కి అంటుకోకుండా ఉండాలి.. అవెన్ నుంచి తీసి అంచుల నుంచి కేక్ ని వేరుచేసి చల్లార్చుకోవాలి. ఇంకేముంది స్వీట్ కార్న్ కేక్ రెడీ ..

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/