తిరుప్పావై : పాశురం

అని€ ఇవ్ఞ్వలకమళన్దా§్‌ు! అడిల్‌పోత్తి,
చ్చెన€ంగు తైని€లంగై శెత్తా§్‌ు! తిఱల్ పోత్తి,
పొన€ చ్చగడ ముత్తెతా§్‌ు! పుకళ్‌పోత్తి,
కును€ కుణిలా వెఱిందా§్‌ు! కళల్‌పోత్తి,
కును€ కుడైయా వెడుత్తా§్‌ు! గుణమ్‌పోత్తి,
వెను€పగై కెడుక్కుమ్ నిన్‌కైయిల్ వేల్‌పోత్తి,
ఎనె€ను€న్ శెవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్,
ఇను€ యామ్ వన్దోం ఇరంగేలో రెమ్బావా§్‌ు
భావం : బలిచక్రవర్తి దగ్గరనుండి మూడడుగుల దానము స్వీకరించి కొలిచిన నీ పాదములకు మంగళం. రామావతారములో దక్షిణదిశ యందు అందమైన లంకానగరమును ధ్వంసమొనర్చిన నీ బలమునకు మంగళము. కృష్ణావతారములో శకటరూపములో నున్న రాక్షసుని కాలితోతన్ని వాని ప్రాణములు, తీసిన కీర్తికి మంగళము. అదే అవతారములో దూడరూపమున నున్న రాక్షసుణ్ణి కాళ్ళతో ట్టుకొని వడిసెలలో రాయివలె విసిరి వెలగచెట్టు రూపముననున్న మరొక రాక్షసుణ్ణి చంపిన నీ పాదములకు మంగళము. గోవర్ధనపర్వతమును ఎత్తి అందరిని రక్షించిన నీ గుణమునకు మంగళము. శత్రువ్ఞల నందరిని చంపిన నీ చేతిలోని వేలాయుధమునకు మంగళం. నీ వీరచరితమును స్తుతిస్తున్నాము. పర యను సాధనమును పొందుటకు వచ్చినాము. అనుగ్రహింపుము.
ఫలం: శుభప్రదమైన జీవితం
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/