మంచి పోషకాలున్న పనస

పండ్లు – ఆరోగ్యం…

Benefits of jack fruit

అల్సర్ , మధుమేహం, గుండెపోటు, రక్తపోటు తదితర సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే సి విటమిన్ చర్మం, శిరోజాలను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.. క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్ పనస లో పుష్కలంగా ఉంటాయి ఖనిజాలు, లవణాలు, థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించటమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది..

ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది.. విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఫుడ్ అలర్జీ ఉన్నవారు పనస పండుకు దూరంగా ఉంటేనే మంచిదట. దీంట్లో ఉండే కాల్షియం ఎముకలు గట్టిపడేలా చేసి , విరగకుండా కాపాడుతుంది.. పచ్చి పనస తో బిర్యానీ కూడా చేస్తారు. పనస పండు గింజలను ఇష్టంగా తింటారు.. వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి.