వంటలో నూనెల వాడకం తగ్గించండి

ఆహారం – ఆరోగ్యం

use of oils in cooking
Use of oils in cooking

వంటలు వండేటప్పుడు నూనె వాడకం తగ్గించాలి. దీని వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగినట్టు అవుతుంది. అది ఎలాగంటే .
వేపుళ్లకు బదులు తాలింపు, బేకింగ్ , గ్రిల్లింగ్, స్ట్రీమింగ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.. దీంతో ఏ, డి, కె, విటమిన్లు మన శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఫ్రైడ్ స్నాక్స్ కు బదులు రోస్ట్ చేసిన, లేదా స్ట్రీమ్ చేసిన స్నాక్స్ ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
నూనెలు కాస్త తక్కువగా వాడేవారు, వంటలో పొరపాటున కాస్త ఎక్కువైతే తినటానికి ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు నూనెను కొలత ప్రకారం వాడుకోవటమే అందుకు సరైన పరిష్కారం. ఇందులో భాగంగా, డైరెక్టుగా బాటిల్ లో నుంచి నూనెను పొసే బదులు టీ స్పూన్ లాంటి వాటితో ఆయిల్ వేయండి. అపుడు ఎంతనూనె వాడుతున్నారో మీకు తెలుస్తోంది.

ఎల్లప్పుడూ ఒకే నూనె కాకుండా కాంబినేషన్ ఆయిల్స్ ను వాడితె మంచిది. సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్ , నువ్వులు, వేరుశెనగ , కొబ్బరి నూనెల్లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ , పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి అవసరం.. మన శరీరం వాటిని స్వయంగా తయారు చేసుకోలేదు.. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి.. అందుకే వేర్వేరు నూనెలను కలిపి వాడుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

నూనె వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో లెక్క వేసి చూసుకోండి. అపుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది.. అవసరం అనుకుంటే ఈ టిప్స్ ద్వారా నూనె వాడకాన్ని తగ్గించవచ్చు

ఇవి కూడా పాటించండి:

వంట నూనెను నాలుగు సార్లు కంటే ఎక్కువ వేడి చేస్తే అందులో ఉండే విటమిన్లు శరీరానికి అందవు.. అంతే కాదు, ఏ నూనె నైనా నాలుగు సార్ల కంటే ఎక్కువ వేడి చేసి వాడ కూడదు. ఎట్టి పరిస్థిల్లోనూ ఇప్పటికే వాడిన నూనెతో తాజా నూనెను కలప కండి . నూనెను వేడి చేసేటప్పుడు వాటి టెంపరేచర్ కూడా మారుతుంది.. ఏ టెంపరేచర్ వద్ద నూనె పొగ రావటం మొదలు పెడుతుందో దాన్ని ‘స్మోకింగ్ పాయింట్’ అంటారు.. దీనిపై కొంచమైనా అవగాహన కలిగి ఉండాలి.

ఒకసారి వాడిన నూనెను మరో సారి వాడేముందు పాత్రలో అడుగున ఉన్న ఆయిల్ ను వదిలేస్తే మంచిది.. లేదంటే వడగట్టుకుని వాడాలి. వంట నూనెపై సూర్యరశ్మి పడకుండా చూడాలి.. నేరుగా ఎండ పడటం వల్ల నూనెలో కొన్ని రసాయనిక మార్పులు జరిగే అవకాశం ఉంది..

వేపుళ్ళకి వాడిన నూనెను మళ్లీ వేయించటానికి ఉపయోగించకండి ఇందువల్ల శరీరంలోకి ట్యాక్సిన్స్ చేరే ప్రమాదం ఉంది.. వంట నూనె కొనేముందు అందులో వున్న కొవ్వు శాతం చూసి మరీ కొనాలి.. వంటకు వాడే నూనెలో 8 నుంచి 10 శాతం శ్యాచురేటెడ్ కొవ్వు ఉండాలి.. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తెర ( సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/