‘డాలీ చాయ్ వాలా’ టీ కొట్టుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్

Bill Gates’ ‘Chai Pe Charcha’ with Dolly Chaiwala breaks the Internet

న్యూఢిల్లీః మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నాగ్ పూర్ టీ టేస్ట్ చేశారు. రోడ్డు పక్కన టీ కొట్టుతో ఇన్ స్టాలో ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలాతో ఫొటోలు దిగారు. ‘ఏక్ ఛాయ్ ప్లీజ్..’ అంటూ ఆర్డర్ చేసిన బిల్ గేట్స్ కు డాలీ చాయ్ వాలా ప్రత్యేకంగా టీ తయారు చేసిచ్చాడు. గాజు గ్లాస్ లో అందించిన టీ తాగుతూ ‘చాయ్ పే చర్చా’ కోసం ఎదురుచూస్తానంటూ బిల్ గేట్స్ ఈ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ అనే యువకుడు ఉపాధి కోసం టీ కొట్టు పెట్టుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ను అనుకరిస్తూ టీ తయారు చేయడం, డ్రెస్సింగ్ స్టైల్, అందించడం చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. డాలీ చాయ్ వాలా పేరుతో ఇన్ స్టాలో సెలబ్రెటీ గా మారాడు. నాగ్ పూర్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గ్ లో డాలీ చాయ్ వాలా బడ్డీ కొట్టు ఫేమస్ ప్లేస్ గా మారిపోయింది. కేటీఎం బైక్ తో వచ్చి, స్టైలిష్ గా టీ తయారు చేసే డాలీని చూడడానికి చాలామంది వస్తుంటారు. ఈ వీడియోలతో డాలీ దేశంలోనే ఫేమస్ అయ్యాడు. తాజాగా డాలీ చాయ్ వాలా టీ కొట్టుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వెళ్లారు. ఈ వీడియోను డాలీ చాయ్ వాలా తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.