ఆరోగ్య గుణాలు మెండుగా ..

బెల్లం వలన ఉపయోగాలు.

తీపి కోసం చక్కెర కు ప్రత్యామ్యాయంగా బెల్లం వాడుతాం . ఆరోగ్య గుణాలు మెండుగా ఉండే బెల్లం సత్వరమే శక్తి నివ్వడమే కాదు.. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది., బెల్లం తినటంవల్ల కలిగే ప్రయోగానాలు ఇవి.

BENEFITS OF EATING JAGGERY


బెల్లం జీర్ణాశయంలోని ఎంజైమ్ లను ఉత్తేజం చేసి జీర్ణ క్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది.. కాలేయంలోని విష పదార్ధాలను తొలగిస్తుంది.. ఒంటిలోనే మలినాలను బయటకు పంపుతుంది.. సత్వర శక్తి నిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సీడెంట్స్, జింక్, సెలీనియం వంటి లవణాలు ప్రీరాడికల్స్ ను బయటకు పంపుతాయి

మహిళలు రోజూ కొద్దిగా బెల్లం తింటే నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపులో నొప్పి, పోస్ట్ మెనోపాజ్ లక్షణాలు తగ్గిపోతాయి. బెల్లంలో అధిక మోతాదులోఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఆమ్లం రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి.. ముఖ్యంగా గర్భిణీలకు బెల్లం అన్ని విధాలా మేలు చేస్తుంది.. వేడి నీళ్లలో బెల్లం వేసుకునే తాగితే ఈ సీజన్లో తరచుగా వేధించే జలుబు, దగ్గు నుంచి ఉవుపశమనం లభిస్తుంది. బెల్లం తింటే ఒళ్ళు వెచ్చగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/andhra-pradesh/