వినాయక నిమజ్జనం..అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు

hyderabad metro rail
hyderabad metro rail

హైదరాబాద్ః నగరంలో వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది. కాగా, హైదరాబాద్‌ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25694 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేశారు పోలీసులు. ముఖ్యమైన జంక్షన్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు పారామిలిటరీ బలగాలతో భద్రత, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి విగ్రహానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. ఇక నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వినియోగించుకోవడానికి అంబులెన్స్ లు సిద్ధం చేశారు. అలాగే… ట్యాంకు బండ్‌ పరిధిలో వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు పోలీసులు.