సమయ పాలన ఇలా!

జీవన వికాసం

Time rule - working
Time rule – working

సమయాభావం అనేది పరీక్షల సమయంలో చాలా పెద్దగా కనిపిస్తుంది. సాధారణంగా ఎక్కువ సమ యంలో తక్కువ పనులు చేస్తున్నప్పుడు ఏమీ అనిపించకపోవచ్చు. గానీ తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టమనిపిస్తుంది. కాలాన్ని అటూఇటూ
తిప్పే శక్తి మనిషికి ఎలాగూ లేదు.

కాబట్టి, వ్యూహాత్మకంగా సమయాన్ని పొదుపు చేసుకోవాలి. ఒక్కో పనికి రోజూ కేటాయించే వ్యవధిని కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ రావడం ఒక్కటే అందుకు ఒక మార్గం. ఉదాహరణకు అప్పటిదాకా స్నానానికి అరగంట సమయాన్ని కేటాయించిన వాళ్లు, పరీక్షల సమయంలో దాన్ని 10 నిమిషాలకే కుదించాలి. రెడీ అవ్వడానికి 10 నిమిషాలు కేటాయించేవారు దాన్ని 5 నిమిషాల్లోనే ముగించాలి. సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం ద్వారా భోజనం సమయం తగ్గించాలి.

ఇలా ఒక్కో పనిలో ఐదు పది నిమిషాలు తగ్గిస్తూ వెళితే రోజు మొత్తంలో అటు ఇటుగా కనీసం రెండు గంటల సమయమైనా మిగులు తుంది. పరీక్షల వేళ రెండు గంటలంటే చాలా ఎక్కువే. అదేవిధంగా అంతకు ముందులా ప్రతి సబ్జెక్ట్‌ను మొదటి పేజి నుంచి చివరి పేజీ దాకా చదివేయడం కాకుండా, ఆయా పాఠాల ఆధారంగా సంక్షిప్తంగా రాసుకున్న సినాప్సిస్‌లు. చదువుకోవా లి.

ఇది సమయం మిగిలేలా చేస్తుంది. అయితే, అప్ప టికే సినాప్సిస్‌ లు సిద్ధం చేసుకు న్నారా లేదా అన్న ది వేరే ప్రశ్న. ఒకవేళ సిద్ధం చేసుకుని ఉండక పోతే, అప్పటికప్పుడు సిద్ధం చేసుకో వడం కూడా పెద్ద కష్టమేమీ కాదు.

సబ్‌ హెడింగ్‌కూ సమ్‌ హెడంగ్‌కూ మధ్య అండర్‌లైన్‌ చేసుకున్న వ్యాక్యా ల్ని కూడా జతచేసి మెరుగైన సినాప్సిస్‌ తయారు చేసుకో వచ్చు.ఏమైనా సినాప్సిస్‌ చూడగానే చాప్టర్‌లోని కీలకాంశాలన్నీ జ్ఞప్తికి వచ్చేలా సిద్ధంచేసుకోవాలి.

అలా అయితే అహోరాత్రులూ, నిద్రాహారాలు మానేసి పుస్తకాల్లో తలదూర్చాల్సిన అవసరం ఉండదు. మధ్య మధ్యలో రిలాక్స్‌ అయ్యే సమయం చిక్కుతుంది. ఎటు తిరిగి పరీక్షల సమయంలో సమయపాలన అనేది పిల్లలకు చాఆ అవసరం. దాన్ని నెమ్మది నెమ్మది గా వారికి నేర్పితే చదువుకు నేందుకు సమయం సరిపోవడం లేదనే కంప్లయింట్‌ రాదు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/