ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల ఇస్తామన్నారు – ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేయాలనీ అనుకోవడం..నలుగురు ఎమ్మెల్యే లతో బేరసారాలు ఆడుతుండగా..పోలీసులు ఎంట్రీ ఇవ్వడం , భారీ ఎత్తున నగదును పట్టుకోవడం , స్వామీజీ, నందు, సతీష్ లను అరెస్ట్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన కొనుగోలు వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేసారు. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు.

బీజేపీ లో చేరేందుకు 100 కోట్ల రూపాయలు డీల్ నడిచినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయలు ఇస్తామని సైతం ఆఫర్ చేశారని పేర్కొన్నారు. స్వామీజీ, నందు, సతీష్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ డీల్‌లో భాగంగానే తాను ఫామ్ హౌస్‌కు వచ్చినట్టు తెలిపారు. మరోపక్క ఈ వ్యవహారం పట్ల టిఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణ నాట్ ఫర్ సేల్ అంటూ సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ ట్రోల్ చేస్తోంది.