మేకప్ కిట్ పరిశుభ్రత

బ్రష్ తో మాత్రమే మేకప్‌ వేసుకోవాలి

Cleaning the makeup kit
Cleaning the makeup kit

అందానికి మెరుగులద్దే అలంకరణ ఉత్పత్తులు, సామగ్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా లిప్‌స్టిక్‌, మస్కారా లాంటి వాటిని ఇతరులతో పంచుకోవడమేం మంచిది.

మేకప్‌ ఉత్పత్తులు వాడినప్పుడు చర్మానికి ఇబ్బంది కలిగిందంటే అందులో సూక్ష్మక్రిములు ఉన్నట్లే.

కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంలో చేసుకోవాలి. ఆల్కహాల్‌ని ఓ స్ప్రే బాటిల్‌లో వేసి ఉత్పత్తులపై కొద్దిగా స్ప్రే చేసిన తరువాత పూర్తిగా ఆరనివ్వాలి.

ఆ తరువాత మాత్రమే వాటిని వాడుకోవాలి. మేకప్‌ ఉత్పత్తులను చేనితో అస్సలు తాకవద్దు.

శుభ్రమైన బ్రష్‌లను ఉపయోగించి మాత్రమే మేకప్‌ వేసుకోవాలి. లేకపోతే వాటిలో సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంది. వారానికోసారైన బ్రష్‌లను శుభ్రం చేసుకోవాలి. బ్రష్‌లను ఆల్కహాల్‌తో

శుభ్రపరిస్తే క్రిమి రహితంగాఉంటాయి. కొన్ని చుక్కల ఆల్కహాల్‌ను లిప్‌స్టిక్‌పై చల్లి టిష్యూ పేపర్‌తో తుడిచేయాలి. మరుసటి రోజు వాడుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/