చిన్న ప్రయోగాలతో మెరిసే చర్మం

అందమే ఆనందం

Beauty tips
Beauty tips

ఏ రంగు చర్మం ఉన్న వారైనా కొన్ని చిట్కాలు పాటిస్తే అందం రెట్టింపు అవుతుంది . వంటింట్లో చేసే చిన్న చిన్న బ్యూటీ ప్రయోగాలే చర్మాన్ని నిగనిగ లాడేలా చేస్తాయి . పైగా రసాయనాల బాధ కూడా ఉండదు. ఎలాగో చూద్దాం .


మేడిపండు , కొబ్బరి నూనె మిశ్రమాన్నిపెదవులపై రాసుకుంటే బాగా మెరుస్తాయి. అంతేకాదు , ఏ కాలమైనా పెదవులు పగలవు. పది చర్మం ఉన్నవాళ్లు ఉదయం లేచిన వెంటనే కొబ్బరి నీళ్లు తాగితే , కమల ఫలం , అవకాడో వంటి పండ్లు తింటే చర్మానికి కావాల్సినంత నీరు అందుతుంది. బొప్పాయి మాస్క్ చర్మం మీది మృత కణాలను పోగొట్టి చర్మాన్ని మెరిపిస్తుంది. పావుకప్పు బొప్పాయి గుజ్జు లేదా బొప్పాయి తాజాగా ఫైనాపిల్ గుజ్జు కలిపి మెత్తగా చేసి ముఖానికి రాసుకోవాలి.. పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారు అవుతుంది. చాకీర వినియోగాన్ని తగ్గిస్తే చర్మం పట్టులా . మృదువుగా ఉంటుంది. డైట్ నుంచి 10 రోజులపాటు చక్కెరను దూరం పెడితే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. చర్మానికి బాదం నూనె రాస్తే ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. సూక్ష్మ పోషక పదార్ధాలు , తృణ ధాన్యాలను నిత్యం తీసుకుంటే చర్మం సహజసిద్ధమైన మెరుపులు చిందిస్తుంది. గ్రీన్ టీ ని టోనర్ గా వాడటం వాళ్ళ కాంతి విహీనంగా ఉన్న చర్మం మెరుపులీనుతుంది. పాలిపోయినట్టుగా ఉన్న చర్మంపై చమోమిలి టీ ఐస్ క్యూబ్స్ తో రాస్తే తాజాగా మారుతుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/