మేడారం జాతర

పండుగలు : విశేషాలు

Medaram jatara
Medaram jatara

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఘనతికెక్కిన మేడారం జాతర వచ్చేసింది. రెండేళ్లకు ఒకసారి మేడారం ఘన సంప్రదాయమైన సమయం ఆసన్న మైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మా త్యాగాలను స్మరించు కునే క్షణాలు , ఈ గిరిజన సాంప్రదాయ రీతిలో జరగటం ఒక విశేషం. అయితే అందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పట్టంకట్టటం అతిపెద్ద విశేషం. వివిధ రకాల పూజలు , ఆదివాసుల వస్త్రధారణ తదితర అంశాలు ఈ ఉత్సవానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. ములుగు జిల్లా తాడ్యయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండం లోనే ఇది అతిపెద్ద జాతర. 900 ఏళ్ళ చరిత్ర కలిగిన జాతర. కోయ గిరిజనుల ఇన్ని కోసం పోరు సల్పిన సమ్మక్క , సారలమ్మ జాతర క్రీస్తు శకం 1260 నుంచి 1329 వరకు ఓరుగల్లు ను పాలించిన ప్రతాపరుధ్ర చక్రవర్తి కాలం నుండి కొనసాగుతున్నట్టు స్థల పురాణాలు చెబుతున్నాయి. మాఘ శుద్ధ పౌర్ణమినాడు మొదలయ్యే ఈ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను కొండ్రయి నుంచి గోవిదారాజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకొస్తారు. రెండో రోజున మేడారం సమీపంలోనే చిలకల గుట్ట నుంచి సమ్మక్కను దేవతను కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడవ రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు . తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను నైవేద్యంగా సమర్పిస్తారు. నాల్గవ రోజు పూజలు చేసి అనంతరం సమ్మక్క , సారలమ్మ పగిడీద్దరాజు , గోవింద రాజులు మన ప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/