రైతులకు మద్దతుగా బండి సంజయ్ ఉపవాస దీక్ష

రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: బండి సంజయ్

bandi sanjay
bandi sanjay

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నేడు సాయంత్రం ఐదు గంటల వరకు ఉపవాస దీక్షకు పూనుకున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభంచక రైతుల ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు సాకులు చబుతు ధాన్యాన్ని కొనుగొలు చేయడం లేదని, నిబందనలు పాటిస్తు నిరసనలు తెలుపుతున్న రైతుల మీద కేసులు నమోదు చేస్తున్నారన్నారు. దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. అధికారులే దళారీలుగా మరారని విమర్శించారు. ఆకరికి రైతులు తమ ధాన్యాన్ని తగులబెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రుల క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నాయి. రైతులకు మద్దతుగా నేడు ఉపవాసదీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/