నేడు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకం

jaganmohan reddy
jaganmohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నేడు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రాంరభించనున్నారు. ఒక్క బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతాయి. ఏ పొదుపు సంఘానికి వడ్డీ డబ్బులు ఎంత జమ చేసిందన్న వివరాలను సిఎం మహిళలకు రాసిన లేఖలో తెలియజేశారు. డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/