ఏపి బిజెపి ఉపాధ్యక్షుడికి పోలీసు నోటీసు

గృహ నిర్బందంలో ఉండాలని ఆదేశం

vishnu vardan reddy
vishnu vardan reddy

అనంతపూర్‌: ఏపి బిజెపి ఉపాధ్యక్షుడు ఎస్‌. విష్ణువర్ధన్‌ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ నిబందనలు అతిక్రమించి రెడ్‌జోన్‌ లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చారనే కారణంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు. నోటీసు ఇచ్చేందకు ఇంటికి వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌ లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసు అతికించారు. విష్ణువర్ధన్‌ రెడ్డి నాలుగు వారాలపాటు గృహ నిర్బందంలోనే ఉండాలంటూ అధికారులు నోటీసులో పేర్కోన్నారు. నిబందనలు ఉల్లంఘించి బయటకు వస్తే కేసు నమోదు చేస్తామని కదిరి సిఐ రామకృష్ణ తెలిపారు. కర్నూలుకు వెళ్లి వచ్చిన కారణంగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యాదికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/