విమానం హైజాక్ చేస్తామంటూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు బెదిరింపు మెయిల్..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. విమానం హైజాక్ చేస్తామని బెదిరిస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెయిల్ రావడంతో అధికారాలు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ వెళ్లే ఓ విమానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆ విమాన సర్వీసును రద్దు చేసి ప్రయాణికులను హోటల్‌కు తరలించారు. మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి, వినోద్, రాకేష్ లను అదుపులోకి తీసుకొని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. దుబాయ్ మీదుగా ఇరాక్ కు వెళ్తున్న ఈ ముగ్గురితో పాటు తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు.

ఇరాక్ లోని అమెరికాకు సోల్జర్స్ కు చెందిన బేస్ క్యాంపులో పని చేస్తున్నాడు తిరుపతి. తిరుపతికి ఐసీస్ తో లింకులు ఉన్నాయంటూ మెయిల్ లో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతిని పట్టుకోకపోతే దేశానికి మరో బిగ్ డే అవుతుందంటూ మెయిల్ చేశారు గుర్తు తెలియని వక్తులు. ఈ తరుణంలోనే.. తిరుపతిని సెండ్ హాఫ్ ఇవ్వడానికి వచ్చిన మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.