కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది

సీఎం కేసీఆర్ పై ఆగ్రహావేశాలు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గతంలోతిరుమల పర్యటనకు వెళ్లిన సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లడం తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ కు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. దీనికోసమేనా పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ సాధించుకున్నది? అని ప్రశ్నించారు.

నీటి ఒప్పందాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకార పత్రాలు తమ వద్ద ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు, ఆంధ్రకు 512 టీఎంసీల నీళ్లు అని నాడు కేటాయింపులు చేసుకున్నది నిజం కాదా? అని సంజయ్ నిలదీశారు. తాను చెప్పింది తప్పయితే శ్రీశైలం డ్యామ్ లో దూకి చచ్చిపోయేందుకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఆ పత్రాల్లో ఉన్నట్టుగా తాను చెప్పిందే నిజమైతే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అన్ని డిమాండ్ చేశారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/