8వ తేదీన కేంద్ర మంత్రివర్గ విస్తరణ!
pm modi
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కొత్తగా 22 మందికి కేంద్ర కేబినెట్‌లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ప్రధాని మోడి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 53 మందితోనే కేంద్ర కేబినెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగతా 28 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/