రోహిత్‌ శర్మకు బర్త్ డే విషెస్ వెల్లువ

‘హ్యాపీ బర్త్‌ డే మాస్టర్‌ ఆఫ్‌ ద పుల్‌ షాట్‌’ అంటూ ఐసీసీ ట్వీట్‌

Rohit sharma with daughter
Rohit sharma with daughter

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 34వ పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌ డే మాస్టర్‌ ఆఫ్‌ ద పుల్‌ షాట్‌’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. రోహిత్‌ నడిచే ప్రతీ వేదిక ఫైర్‌గానే ఉంటుంది. అతని పేరు రో-హిట్‌’ అని ముంబై ఇండియన్స్‌ విష్‌ చేసింది. ‘ భార్య రితికాతో కలిసి రోహిత్‌ శర్మ తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగా రితికా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో రోహిత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వరల్డ్ ఈజ్‌ ఏ బెటర్‌ ప్లేస్‌ విత్‌ యూ. హ్యాపీ బర్త్‌డే రో. నువ్వు మాకు దొరకడం ఎప్పటికీ గొప్పగా ఉంటుంది’ అని కూతురు సమైరాతో రోహిత్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ‘

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/