కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీజేపీ దీక్ష: బండి సంజయ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అవమానించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైందని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు రారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ఎస్సీగా ఉన్న డిప్యూటీ సీఎంను మార్చారని విమర్శించారు. దళిత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. బాబా సాహేబ్‌కు భారతరత్న ఇచ్చింది బీజేపీయేనన్నారు. మూర్ఖుడిని వదిలేస్తే బలుపెక్కి బరితెగిస్తారని, కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/