అవతార్ 2 రన్ టైం..ఎంతో తెలుసా..?

యావత్ సినీ లవర్స్ ఎదురుచూస్తున్న అవతార్ 2 మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 16 న పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో సినిమా రన్ టైం బయటకు వచ్చి ఆశ్చర్య పరుస్తుంది. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిడివి ఎక్కువగా ఉందని అంత సమయం జేమ్స్ కామరూన్ అభిమానుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలడా అనే వార్తలు వినిపిస్తున్నాయి… ‘అవతార్‌2’ నిడివి 192 నిమిషాల, 10 సెకన్లు అట. అంటే 3 గంటలా 12 నిమిషాల 10 సెకన్లు. ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, థియేటర్‌లో ప్రేక్షకుడిని అంత సేపు కూర్చోబెట్టాలంటే అందుకు తగిన కథ, కథనాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండాలి. మరి ఆ రేంజ్ లో జేమ్స్ కామరూన్ అవతార్ 2 ను తెరకెక్కించారా..లేదా అనేది చూడాలి.